న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: కాంగ్రెస్, బీజేపీ మధ్య బట్టల యుద్ధం నడుస్తున్నది. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఖరీదైన టీ షర్ట్ ధరించారు. దీంతో ‘రాహుల్ రూ.41 వేల విలువైన తెల్లని బర్బెరీ టీ షర్ట్ ధరించారు. భారత్.. దేఖో’ అని బీజేపీ ట్వీట్ చేసింది. టీ షర్ట్ ధరించిన రాహుల్ ఫొటోను, ఆ టీషర్ట్ ధరను చూపుతున్న ఫొటోను షేర్ చేసింది.
దీనిపై కాంగ్రెస్ కూడా కౌంటర్ ఇచ్చింది. ‘అరే… భారత్ జోడో యాత్రకు తరలివచ్చిన అశేష జనవాహిణిని చూసి భయపడ్డట్టున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడండి. బట్టల గురించే మాట్లాడాలనుకుంటే చర్చ ప్రధాని మోదీ ధరించిన రూ.10 లక్షల సూటు, రూ.1.5 లక్షల విలువైన కండ్లద్దాల వరకు వెళ్తుంది’ అని కాంగ్రెస్ చురకలంటించింది.