Rahul Gandhi | లోక్సభ సభ్యత్వం పునరుద్ధరించిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలిసారిగా తన పార్లమెంట్ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడుతూ మణిపూర్లో వేలాది మంది ప్రజలు ఇబ్బందులుపడ్డారన్నారు. ఒకరి ఇల్లు తగులబెట్టారని, ఓ సోదరిపై అత్యాచారం జరిగిందని, సోదరుడు, తల్లిదండ్రులను చంపారని విమర్శించారు. మణిపూర్ అంతటా ఎవరో కిరోసిన్ పోసి నిప్పంటించినట్లుగా ఉందన్నారు.
పార్లమెంట్లో ప్రధాని 2.13గంటలు మాట్లాడారన్న రాహుల్.. మణిపూర్ అంశంపై రెండు నిమిషాలే మాట్లాడారని, ఈ సమయంలో నవ్వారని విమర్శించారు. ఇదిలా ఉండగా రాహుల్ తోడా గిరిజన సంఘం సభ్యులను కలిశారు. అయితే, గిరిజనులు రాహుల్ గాంధీని మళ్లీ ప్రధానిగా ఇక్కడకు రావాలన్నారు. ఆ తర్వాత ఆయన గిరిజనుల దేవతను దర్శించుకున్నారు. ‘మోదీ’ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు రాహుల్కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఆయన లోక్సభ సభ్యత్వం రద్దయ్యింది. సూరత్ సెషన్ కోర్టు, గుజరాత్ హైకోర్టును రాహుల్ ఆశ్రయించగా.. ఊరట లభించలేదు. చివరకు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సూరత్ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. దాంతో లోక్సభ సెక్రటేరియట్ రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు.
#WATCH | Congress MP Rahul Gandhi with members of the Toda tribal community in Muthunadu village near Ooty in Tamil Nadu pic.twitter.com/g7iBVcKhTJ
— ANI (@ANI) August 12, 2023