న్యూఢిల్లీ: జనాల్లో ఉన్నప్పుడు కూడా తల్లి సోనియాగాంధీ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపర్చడానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఎప్పుడూ సిగ్గుపడరు. తల్లి బూట్లకు షూలేస్ కట్టడం దగ్గరి నుంచి ఆమెను ప్రేమగా హత్తుకోవడం వరకు ఏదైనా ఆయన ఏమాత్రం సిగ్గుపడకుండా చేస్తారు. అలాంటి చాలా సందర్భాలను ఆయన సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు. ప్రజల హృదయాలను దోచే ఆ సందర్భాలు ప్రతి ఒక్కరి నుంచి మన్ననలు అందుకున్నాయి.
ఇవాళ కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో కూడా తల్లీకొడుకుల మధ్య ఓ సంతోషకరమైన సందర్భం చోటుచేసుకుంది. ఆ జాయ్‌ఫుల్ మూవ్‌మెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో సోనియాగాంధీ తన పక్కనున్న మరో మహిళా నేతతో రాహుల్‌గాంధీ గురించి ఏదో చెబుతూ కనిపించింది. అది విన్న రాహుల్‌గాంధీ సరదాగా నవ్వుతూ తల్లి నోరు నొక్కేశారు. అయినా సోనియాగాంధీ మహిళా నేతతో తన ముచ్చటను ఆపకుండా కంటిన్యూ చేశారు.
ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, గత అక్టోబర్‌లో కూడా రాహుల్‌గాంధీ తన తల్లి కాళ్ల దగ్గర మోకాళ్లపై కూర్చుని షూలేష్ కడుతూ కనిపించారు. ఆ ఫొటోను రాహుల్ ట్విటర్లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ఇటీవల ఓ కార్యక్రమంలో తల్లిని వెనుక నుంచి ప్రేమగా కౌగిలించుకుని ఉన్న ఫొటోను కూడా రాహుల్‌గాంధీ షేర్ చేశారు. అప్పుడు కూడా రాహుల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.
#WATCH | Congress MP Rahul Gandhi had a joyful moment with his mother Sonia Gandhi during the party’s 138th Foundation Day celebration event in Delhi pic.twitter.com/tgqBAxY2co
— ANI (@ANI) December 28, 2022