ముంబై: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బ్యాగులను ఎలక్షన్ కమిషన్ (ఈసీ) అధికారులు తనిఖీ చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం శనివారం అమరావతికి ఆయన వచ్చారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రయాణించిన హెలికాప్టర్‌తోపాటు అందులోని ఆయనకు చెందిన బ్యాగులను ఈసీ అధికారులు చెక్ చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న పార్టీ నేతలతో మాట్లాడటంలో ఆయన బిజీ అయ్యారు.
కాగా, కేవలం ప్రతిపక్ష నేతల బ్యాగులను మాత్రమే ఈసీ అధికారులు తనిఖీ చేస్తున్నారని మహారాష్ట్రలో ప్రతిపక్షమైన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి నేతలు ఆరోపించారు. తన బ్యాగులను తనిఖీ చేసిన ఈసీ అధికారులపై ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు ఫడ్నవీస్, అజిత్ పవార్‌తోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బ్యాగులను కూడా ఈసీ అధికారులు ఇటీవల తనిఖీ చేశారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరుగనున్నది. 23న జార్ఖండ్‌తోపాటు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.
In Amravati LoP Rahul Gandhi’s Bags were checked by Election Commission of India
Many national Bjp leaders are comming in Maharashtra for campaign but rarely they check any one of them pic.twitter.com/trjJOuZkT7— Pritesh Shah (@priteshshah_) November 16, 2024