పాట్నా, ఆగస్టు 29: బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో గురువారం కొందరు ప్రధాని మోదీ తల్లిని దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వ్యాఖ్యలపై పాట్నాలోని కాంగ్రెస్ కార్యాలయం వెలుపల బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగి కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణపై రాహు ల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.