లక్నో: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), యూపీ మంత్రి దినేశ్ ప్రతాప్ సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. రాయ్‌బరేలీ నియోజకవర్గం జిల్లా అభివృద్ధిపై జరిగిన దిశా మీటింగ్‌లో ఆ ఇద్దరి నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. సెప్టెంబర్ 11వ తేదీన ఈ ఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతున్నది. నియోజకవర్గా అభివృద్ధి పనులపై చర్చ జరుగుతున్న సయమంలో.. ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఆ ఇద్దరూ గట్టిగా అరిచారు. తమ వాదనలను వినిపించే ప్రయత్నం చేశారు.
ఒకవేళ రాయ్‌బరేలీ నియోజకవర్గం ప్రజల తరపున రాహుల్ గాంధీ పోరాడితే అప్పుడు ఆయనకు మద్దతు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. కానీ దిశా మీటింగ్ వేదికగా పార్టీ రాజకీయాలు ప్రచారం చేసినా, ప్రభుత్వాన్ని విమర్శించినా ఊరుకునేది లేదన్నారు. దిశా మీటింగ్‌కు నియోజకవర్గ ఎంపీ చైర్ చేస్తారని, గ్రామీ అభివృద్ధి శాఖకు చెందిన 43 ప్రోగ్రామ్‌ల నిర్వహణ ఆ ఎంపీ బాధ్యతలోనే ఉంటుందని మంత్రి దినేశ్ అన్నారు. కానీ రాహుల్ గాంధీ అన్ని కార్యక్రమాలకు ఓనర్ తరహాలో ఫీలవుతున్నారని, దీన్ని సహించేది లేదని మంత్రి దినేశ్ తెలిపారు.
కలెక్టరేట్లోని బచత్ భవన్లో కేంద్ర స్కీమ్‌లపై ఆ మీటింగ్‌లో సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమానికి అమేథీ ఎంపీ, దిశా చైర్పర్సన్ కిశోరీ లాల్ శర్మ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
In the DISHA meeting, LoP Rahul Gandhi ji humbled down BJP minister Dinesh Pratap Singh.
The meeting, chaired by Rahul Gandhi ji was attended by MPs and MLAs from Amethi and Rae Bareli, including Singh. pic.twitter.com/tXzJSWovAg
— India With Congress (@UWCforYouth) September 12, 2025