సీడీఎస్ రావత్ క్షేమంగా ఉండాలి: రాహుల్ గాంధీ
Rahul Gandhi | సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ తమిళనాడులోని ఊటీ కొండల్లో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి సీడీఎస్ బిపిన్ రావత్‌తోపాటు ఆయన సతీమణి మధులికా రావత్ క్షేమంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ తమిళనాడులోని ఊటీ కొండల్లో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం నుంచి సీడీఎస్ బిపిన్ రావత్‌తోపాటు ఆయన సతీమణి మధులికా రావత్ క్షేమంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఆకాంక్షించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు తర్వగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాహుల్ ట్వీట్ చేశారు.

తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ కూలింది. త్రివిధదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తన ఫ్యామిలీతో ఎంఐ సిరీస్ హెలికాప్టర్లో వెళ్తున్నట్లు తెలిసింది. నీలగిరి అడవుల్లో కూనురు వద్ద హెలికాప్టర్ కూలినట్లు గుర్తించారు. రెస్క్యూ సిబ్బంది వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లింది. సీనియర్ రక్షణశాఖ అధికారులతో హెలికాప్టర్ వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రమాదంలో ఆర్మీ హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయింది. ఆ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందినట్లు ప్రకటించారు.
ఈ హెలికాప్టర్లో బిపిన్ రావత్ దంపతులతో పాటు బ్రిగేడియర్ ఎల్ఎస్ లిడ్డర్, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ సింగ్, ఎన్కే గురుసేవక్ సింగ్, ఎన్కే జితేంద్ర కుమార్, వివేక్ కుమార్, బీ సాయి తేజ, హవల్దార్ సత్పాల్ ఉన్నారు.
Hoping for the safety of CDS General Bipin Rawat, his wife and others onboard the chopper.
— Rahul Gandhi (@RahulGandhi) December 8, 2021
Prayers for speedy recovery.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

