న్యూఢిల్లీ, డిసెంబర్ 27: వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సిద్ధమయ్యారు. జనవరి 14 నుంచి రాహుల్ తూర్పున మణిపూర్ నుంచి పశ్చిమాన మహారాష్ట్రలోని ముంబై వరకు ‘భారత్ న్యాయ యాత్ర’ చేపడుతారని ఆ పార్టీ బుధవారం ప్రకటించింది. 67 రోజుల పాటు జరిగే ఈ యాత్ర 14 రాష్ర్టాల్లోని 85 జిల్లాల గుండా సాగుతుందని వెల్లడించింది.