Loksabha Elections 2024 : అగ్నివీర్ స్కీమ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం తాము అధికారంలోకి రాగానే ఈ పధకాన్ని రద్దు చేస్తామని పునరుద్ఘాటించారు. హరియాణలోని మహేంద్రఘఢ్లో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. ప్రధాని మోదీ భారత సైనికులను కూలీలుగా మార్చారని ఆందోళన వ్యక్తం చేశారు.
అగ్నివీర్ స్కీమ్‌ను సైన్యం కోరుకోవడం లేదని, ఈ పధకాన్ని ప్రధాని కార్యాలయం రూపొందించిందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ పధకాన్ని చెత్తబుట్టలో పడేస్తామని చెప్పారు. హరియాణ రైతులు పొలాల్లో కష్టపడుతున్నారని, కానీ మోదీ ప్రభుత్వం బిలియనీర్లకు సాయం చేసేలా ల్యాండ్ ట్రిబ్యునల్ బిల్‌ను రద్దుచేసి రైతుల హక్కులను కాలరాసిందని ఆరోపించారు. మూడు వ్యవసాయ బిల్లులను తీసుకువచ్చిందని, దీనిపై భారత్ జోడో యాత్రలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మీడియాలో ఎక్కడా కనిపించలేదని అన్నారు.
ప్రధాని మోదీ 22 మంది సంపన్నుల రుణాలు మాఫీ చేశారని ఇది రైతులను అవమానించడమేనని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇక హరియాణలోని మొత్తం పది పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆరో దశలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో హరియాణలోని మొత్తం పది నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించింది.
Read More :
KTR | తెలంగాణలోనూ బుల్డోజర్ రాజ్.. చోటా భాయ్‌పై కేటీఆర్ సెటైర్