సుల్తాన్పూర్, డిసెంబర్ 16: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్ సుల్తాన్‌పూర్‌లోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సమన్లు జారీచేసింది. జనవరి 6న కోర్టు ముందు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
అమిత్‌షాపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత విజయ్ మిశ్రా 2018, ఆగస్టు 4న కేసు వేశారు. ఈ కేసులో డిసెంబర్ 16న(శనివారం) హాజరు కావాలని అంతకుముందు సమన్లు జారీచేయగా.. రాహుల్ కోర్టుకు రాలేదు. దీంతో తాజాగా మరోసారి ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మరోసారి సమన్లు ఇచ్చిందని పిటిషన్‌దారు తరపు న్యాయవాది సంతోష్ పాండే తెలిపారు.