ప్రధాని, హోంమంత్రి సలహాలతో కుదేలైన రిటైల్ ఇన్వెస్టర్లు : ఎగ్జిట్ పోల్స్ వ్యవహారంపై విచారణకు రాహుల్ డిమాండ్
స్టాక్ మార్కెట్లో మదుపు చేసే ఐదు కోట్ల కుటుంబాలకు ప్రధాని, కేంద్ర హోమంత్రి ఎందుకు పెట్టుబడి సలహాలు ఇచ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వారి పని పెట్టుబడి సలహాలు ఇవ్వడమా అని ఆయన నిలదీశారు.
స్టాక్ మార్కెట్లో మదుపు చేసే ఐదు కోట్ల కుటుంబాలకు ప్రధాని, కేంద్ర హోమంత్రి ఎందుకు పెట్టుబడి సలహాలు ఇచ్చారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. వారి పని పెట్టుబడి సలహాలు ఇవ్వడమా అని ఆయన నిలదీశారు. షేర్ల విలువను తారుమారు చేసిన ఆరోపణలపై సెబీ దర్యాప్తును ఎదుర్కొంటున్న బిజినెస్ గ్రూప్‌నకు చెందిన మీడియా సంస్ధలకు ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లోనే ఎందుకు వీరు పెట్టుబడి సలహాలను ఇచ్చారని ప్రశ్నించారు.
తప్పుడు ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇచ్చిన వారికి, బీజేపీకీ, ఐదు కోట్ల వేతన జీవుల కష్టార్జితాన్ని కొల్లగొట్టేందుకు ఎగ్జిట్ పోల్స్‌కు ఒక్కరోజు ముందు పెట్టుబడి పెట్టిన విదేశీ ఇన్వెస్టర్ల మధ్య ఉన్న సంబంధం ఏంటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)చే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీని వెనుక భారీ కుట్ర, కుంభకోణం ఉందని అన్నారు. షేర్లు కొనాలని ప్రధాని, కేంద్ర హోంమంత్రి సూచనలతో పెట్టుబడిన పెట్టిన భారత రిటైల్ ఇన్వెస్టర్ల వేలాది కోట్ల రూపాయల సొమ్మును కొందరు కాజేశారని ఆరోపించారు.
ఈ మొత్తం వ్యవహారంపై విచారన జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇది అదానీ అంశంతో ముడిపడిన నిగూఢ అంశమని, ఇందులో ప్రధాని, కేంద్ర హోంమంత్రి నేరుగా జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. ఐబీ నివేదికలు, పార్టీ వర్గాల సమాచారం ఆధారంగా ఎన్నికల ఫలితాలపై వీరికి ఓ అంచనా ఉంటుందని, అయితే ఈ డేటా ఆధారంగా షేర్లు కొనాలని రిటైల్ ఇన్వెస్టర్లకు ఓ ప్రధాని సలహా ఇవ్వడం దేశంలో ఇంతవరకూ ఎన్నడూ జరగలేదని రాహుల్ గాంధీ గుర్తుచేశారు.
స్టాక్ మార్కెట్‌పై ఓ ప్రధాని ఎన్నడూ వ్యాఖ్యలు చేయలేదని, కానీ ప్రధాని తొలిసారిగా పలుమార్లు స్టాక్ మార్కెట్ పెరుగుతుందని ఎన్నో సందర్భాల్లో చెప్పారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని ప్రధానికి సమాచారం ఉందని, అసలేం జరగుతుందనేది ఐబీ డేటా, పార్టీ గణాంకాలు ఆధారంగా ఆయనకు తెలుసని రాహుల్ పేర్కొన్నారు.
Read More :
Road Accident | సిగ్నల్ పడుతుందన్న తొందరలో వేగంగా దూసుకొచ్చి మరో కారును ఢీకొట్టి.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer | శ్రేయస్ అయ్యర్ ఔట్‌తో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా అభిమాని .. వైరల్‌గా మారిన వీడియో
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

