రైతుల సత్యాగ్రహం.. అహంకారాన్ని ఓడించింది: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ఇవాళ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కామెంట్ చేశారు. రైతులు చేపట్టిన సత్యాగ్రహం.. కేంద్ర ప్రభుత్వ అహంకారాన్ని ఓడించినట్లు రాహుల్ విమర్శించారు. ఏడాది కాలం నుంచి దేశవ్యాప్తంగా రైతులు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఆ ఆందోళనల్లో వందల సంఖ్యలో అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు మోదీ ప్రకటన చేసిన తర్వాత.. రాహుల్ గాంధీ తన ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. దేశ రైతులు తమ సత్యాగ్రహ దీక్షతో.. కేంద్ర సర్కార్ అహంకారాన్ని తలదించుకునేలా చేశారన్నారు. ఇది అన్యాయంపై విజయమని, ఈ సందర్భరంగా రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. జై హింద్, జై కిసాన్ అంటూ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడిన పాత వీడియోను కూడా తన ట్విట్టర్లో రాహుల్ షేర్ చేశారు. రైతు చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా చేస్తామని, తన మాటాలను గుర్తుపెట్టుకోవాలంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను రాహుల్ పోస్టు చేశారు.
देश के अन्नदाता ने सत्याग्रह से अहंकार का सर झुका दिया।
— Rahul Gandhi (@RahulGandhi) November 19, 2021
अन्याय के खिलाफ़ ये जीत मुबारक हो!
जय हिंद, जय हिंद का किसान!#FarmersProtest https://t.co/enrWm6f3Sq
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

