Rahul Gandhi | ఆ విషయంలో మనకన్నా చైనా, పాక్ బెటర్ : రాహుల్ గాంధీ
Rahul Gandhi | కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అధ్వాన్నంగా శిక్షణను ఇచ్చి అగ్ని వీరులను మోదీ సైన్యం సరిహద్దుల్లోకి పంపుతుందని మండిపడ్డారు. ఈ విషయంలో చైనా, పాకిస్థాన్ మనకంటే మెరుగైన శిక్షణ ఇస్తున్నాయని ఆయన విమర్శలు గుర్పించారు.
Rahul Gandhi | కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అధ్వాన్నంగా శిక్షణను ఇచ్చి అగ్ని వీరులను మోదీ సైన్యం సరిహద్దుల్లోకి పంపుతుందని మండిపడ్డారు. ఈ విషయంలో చైనా, పాకిస్థాన్ మనకంటే మెరుగైన శిక్షణ ఇస్తున్నాయని ఆయన విమర్శలు గుర్పించారు. బిహార్ రాజధాని పాట్నా గాంధీ మైదాన్‌లో జరిగిన మహాకూటమి జన్ విశ్వాస్ మహార్యాలీ జరిగింది. ఈ సందర్భంగా అగ్నివీరుల అంశంపై స్పందించారు. ప్రజా వ్యతిరేకత ఉన్నప్పటికీ సైన్యంలో మోదీ అగ్నివీర్ స్కీమ్‌ను అమలు చేశారన్నారు.
అగ్నివీరులకు ఆరునెలల శిక్షణ ఇచ్చి నరేంద్ర మోదీ ప్రభుత్వ చైనా, పాక్ సైన్యాలను ఎదుర్కొనేందుకు పంపుతోందన్నారు. ఇది అన్యాయమని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు భయపడేది లేదన్న ఆయన.. వాటిని తొలగించి భారత ప్రభుత్వాన్ని నెలకొల్పుతామన్నారు. దేశంలో విద్వేషం వ్యాప్తిసుందన్న ఆయన.. ఎందుకు కారణాలపై ప్రశ్నించారు. దేశంలో ద్వేషానికి తావులేదని.. విద్వేషానికి కారణం అన్యాయం జరుగడమేనన్నారు. యువత, రైతులు, పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు.
మోదీ కోసం ఇద్దరు ముగ్గురు బిలియనీర్ల కోసం మాత్రమే పని చేస్తారన్నారు. లక్షల కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని.. రైతుల రుణాలను మాత్రం ఎందుకు మాఫీ చేయడం లేదని ప్రశ్నించారు. దేశంలోని ఓడరేవులు, రైల్వేలు ఓ పారిశ్రామికవేత్తకు అప్పగించారని ఆరోపించారు. దేశంలో వెనుకబడిన.. అత్యంత వెనుకబడిన, దళిత, గిరిజన ప్రజల జనాభా 73శాతం ఉందని.. బడా కంపెనీల జాబితాలో చూస్తే ఈ వర్గాల నుంచి ఒక్క వ్యక్తి కనిపించడం లేదన్నారు. 73శాతం జనాభా నుంచి ఒక్క వ్యక్తి కార్పొరేట్ ఆసుపత్రిలో కనిపించడన్నారు. గతంలో పేదలకు ప్రభుత్వరంగంలో ఉద్యోగాలు వచ్చేవని.. కానీ నరేంద్ర మోదీ అన్ని తలుపులు మూసివేశారని మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
Godavari water | గోదావరి జలాలు విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రైతుల ధర్నా
రాయపోల్ నూతన ఎస్ఐకి ఘన సన్మానం!
Jason Sanjay | సీఎం విజయ్ కొడుకు హీరోగా ఎంట్రీ?.. లైకా ప్రొడక్షన్స్‌తో చర్చలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

