Rahul Gandhi | నా ప్రసంగానికి భయపడే మోదీ నాపై అనర్హత వేటు వేయించారు: రాహుల్ గాంధీ
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఎంపీగా అనర్హత వేటుపై (Disqualified as the Lok Sabha MP) రాహుల్ తాజాగా స్పందించారు.
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఎంపీగా అనర్హత వేటుపై (Disqualified as the Lok Sabha MP) రాహుల్ తాజాగా స్పందించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయన్నారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి అదానీ (Adani)తో ప్రధాని మోదీ (Pm Modi)కి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఇదే విషయంపై పార్లమెంట్లో మాట్లాడినట్లు చెప్పారు. తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ వ్యవహారంలో అన్ని సాక్ష్యాలను పార్లమెంట్‌కు సమర్పించినట్లు చెప్పారు. అప్పుడే బీజేపీ తనపై కుట్రను మొదలుపెట్టిందని రాహుల్ పేర్కొన్నారు.
‘అదానీ (Adani) వ్యవహారంలో నేను పార్లమెంట్‌కు అన్ని సాక్ష్యాలు సమర్పించాను. గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి అదానీతో మోదీకి సబంధాలున్నాయి. లోక్‌సభలో నా ప్రసంగాన్ని కావాలనే తొలగించారు. నిబంధనలను ఉల్లంఘించిన అదానీకి ఎయిర్‌పోర్టులు కట్టబెట్టారు. నా గురించి మంత్రులు పార్లమెంట్లో అబద్దాలు చెప్పారు. లండన్ ప్రసంగంపై తప్పుడు ప్రచారం చేశారు. మంత్రుల ఆరోపణలపై సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని కోరాను. అందుకు స్పీకర్ నవ్వి.. మాట్లాడే అవకాశం రాదు అని నాతో అన్నారు. నేను దేనికీ భయపడను. ప్రశ్నించడం మానను. అదానీ వ్యవహారంపై ప్రశ్నిస్తూనే ఉంటా’ అని అన్నారు.
రూ.20 వేల కోట్ల పెట్టుబడులు అదానీకి ఎక్కడివి..?
‘రక్షణ ప్రాజెక్టులన్నీ అదానీకే ఎందుకు ఇస్తున్నారు..? అదానీకి రూ.20 వేల కోట్ల పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి..? ఆ డబ్బు అదానీది కాదు. ఎవరో పెట్టుబడి పెట్టారు. అదానీ షెల్ కంపెనీలపై మోదీ సమాధానం చెప్పాలి. అదానీ కంపెనీల్లో ఎవరు పెట్టుబడి పెట్టారో వెల్లడించాలి. చైనీయులు కూడా అదానీ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు. అదానీ వ్యవహారం నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని’ అని రాహుల్ తెలిపారు.
మద్దతిచ్చిన విపక్షాలకు ధన్యవాదాలు..
‘కోర్టు తీర్పు గురించి నేను మాట్లాడను. నా ప్రసంగానికి భయపడే మోదీ నాపై అనర్హత వేటు వేయించారు. నాకు మద్దతిచ్చిన విపక్ష నేతలకు ధన్యవాదాలు. ప్రతిపక్ష నేతలందరితో కలిసి పనిచేస్తా. నా సభ్యత్వాన్ని పునరుద్ధరించినా నా పోరాటం ఆగదు’ అని రాహుల్ స్పష్టం చేశారు.
పార్లమెంట్ నుంచి శాశ్వతంగా బహిష్కరించినా భయపడేది లేదు
తాను నిజమే మాట్లాడతానని.. తనకు ఈ దేశం ప్రేమ, గౌరవం ఇచ్చిందన్నారు. వయనాడ్ ప్రజలతో తనకు కుటుంబ సంబంధాలున్నట్లు చెప్పారు. అదానీ షెల్ కంపెనీల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎంల పెట్టుబడి ఉంటే జైల్లో వేయాలని రాహుల్ సవాల్ విసిరారు. అదానీ బండారం బయటపడుతుందనే మోదీ ఈ నాటకానికి తెరతీశారని విమర్శించారు. తనని పార్లమెంట్ నుంచి శాశ్వతంగా బహిష్కరించినా భయపడేది లేదని, ప్రజల్లో ఉంటానని రాహుల్ తేల్చి చెప్పారు.
Also Read..
Kushboo Sundar | రాహుల్‌కు జైలు శిక్ష.. మోదీ ఇంటిపేరుపై ఖుష్బూ చేసిన పాత ట్వీట్ వైరల్
Rahul Gandhi | సెప్టెంబర్‌లో వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక..?
Rahul Gandhi | అనర్హత వేటుతో రాహుల్ గాంధీ అధికారిక బంగ్లా ఖాళీ చేయక తప్పదా?\
Section 8 (3): ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8(3)ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చలేదు.. ‘మాతృభూమి’ వివాదాలపై సల్మాన్ ఖాన్ ఫుల్ క్లారిటీ!
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

