రాంచీ: జార్ఖండ్ మాజీ సీఎం, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిశారు. (Rahul Gandhi Meet Kalpana Soren) ఆ రాష్ట్రంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఆమెతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఈ విషయం తెలిపారు. రాంచీలోని హెచ్ఈసీ కాంప్లెక్స్‌లోని చారిత్రాత్మక షాహీద్ మైదాన్‌లో బహిరంగ సభకు కొన్ని నిమిషాల ముందు, జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గిన తర్వాత కల్పనా సోరెన్‌ను రాహుల్ గాంధీ కలిసినట్లు చెప్పారు. వారిద్దరూ కలిసిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కాగా, అవినీతి ఆరోపణలతో ఈడీ అరెస్ట్ చేసిన హేమంత్ సోరెన్ కోర్టు అనుమతితో సోమవారం జరిగిన బలపరీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన తన అరెస్ట్‌కు బీజేపీ కారణమని విమర్శించారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను రుజువు చేయాలని బీజేపీని సవాల్ చేశారు. అవినీతి ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తాను తప్పుకుంటానని అన్నారు.
HEC काम्प्लेक्स के ऐतिहासिक शहीद मैदान में जनसभा से कुछ मिनट पहले और झामुमो-कांग्रेस-राजद-सीपीआई (एमएल) गठबंधन द्वारा विधानसभा के पटल पर भाजपा और उसके सहयोगियों को करारी शिकस्त देने के कुछ मिनट बाद, राहुल गांधी ने हेमंत सोरेन के आवास पर उनकी पत्नी कल्पना सोरेन से मुलाक़ात की।
— Jairam Ramesh (@Jairam_Ramesh) February 5, 2024