గోవా విమోచనంపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ప్రధాని నెహ్రూ కారణంగానే గోవా 15 సంవత్సరాల తర్వాత భారత్లో అంతర్భాగమైందని అన్నారు. నెహ్రూ తలుచుకుంటే భారత్కు స్వాతంత్రం వచ్చిన రోజే గోవాకు కూడా పోర్చుగీసు వారి నుంచి విముక్తి లభించేదని మోదీ విమర్శించారు. ఈ విమర్శలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ భగ్గుమన్నారు. గోవా పర్యటనలో భాగంగా రాహుల్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆ రోజుల్లో ఎలాంటి పరిస్థితి వుండేదో ప్రధాని మోదీకి తెలియదని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏం జరిగిందో ఆయనకు తెలియదని రాహుల్ ఎద్దేవా చేశారు. ఆ రోజుల నాటి చరిత్రే మోదీకి తెలియదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏం జరిగిందో ఆయనకు తెలియదు. నిరుద్యోగం, పర్యావరణం లాంటి విషయాలపై ప్రజల దృష్టి మరల్చడానికే ప్రధాని మోదీ గోవాకు వచ్చారు. అంటూ రాహుల్ ఫైర్ అయ్యారు.