న్యూఢిల్లీ : టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సహచర ఆటగాడు మహమ్మద్ షమీకి మద్దతుగా మాట్లాడినందుకు కోహ్లీ తొమ్మిది నెలల కుమార్తెపై బెదిరింపులు వచ్చాయి. ఈ క్రమంలో విరాట్‌కు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు. బెదిరింపులకు పాల్పడే వ్యక్తులు ద్వేషంతో నిండిపోయారంటూ ట్వీట్ చేశారు. ‘ప్రియమైన విరాట్.. ఈ వ్యక్తులు ద్వేషంతో నిండిపోయారు. ఎందుకంటే వారికి ఎవరూ ప్రేమను ఇవ్వను. వారిని క్షమించండి.. జట్టును రక్షించండి’ అంటూ ట్వీట్ చేశారు. ఇంతకు ముందు ఢిల్లీ మహిళా కమిషన్ సైతం ఢిల్లీ పోలీసులకు నోటీసు పంపింది. విరాట్ కోహ్లీ కుటుంబానికి బెదిరింపులు వచ్చినట్లు మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా తీసుకున్నట్లు తెలిపింది. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీని సమర్పించాలని, అరెస్టు చేసిన నిందుల వివరాలను ఇవ్వాలని కోరింది.
Dear Virat,
— Rahul Gandhi (@RahulGandhi) November 2, 2021
These people are filled with hate because nobody gives them any love. Forgive them.
Protect the team.