హిందుత్వవాదులెప్పుడూ సమాజంలో హింసను, ద్వేషాన్ని ప్రేరేపిస్తూనే ఉంటారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దీంతో సమాజం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని మండిపడ్డారు. భారత్ హింసకు ఎప్పుడూ వ్యతిరేకమని, భవిష్యత్తులో హింస వైపు సమాజం వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని పేర్కొన్నారు. హరిద్వార్‌లో జరిగిన ధర్మాచార్యుల సమ్మేళనంలో సాధు సంతులు ముస్లింలపై చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని రాహుల్ పై వ్యాఖ్యలు చేశారు. ఈ సమ్మేళనం జూనా అఖాడా అధినేత నరసింహా గిరి స్వామీజీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమ్మేళనంలో ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కొందరు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.