ముంబై : ఎంఎన్ఎస్ నేత జావెద్ షేక్ కుమారుడు రాహిల్ జావెద్ షేక్(Rahil Javed)పై ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాగి, అర్థనగ్నంగా రాహిల్ రోడ్డుపై హల్చల్ చేశాడు. మరాఠీ నటి, ఇన్ఫ్లూయెన్సర్ రాజశ్రీ మోరే పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ఘటన అంధేరిలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతున్నది. రాజశ్రీ కారును రాహిల్ ఢీకొట్టాడు. ఆ తర్వాత తన తండ్రి రాజకీయ పలుకుడి గురించి మాట్లాడాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ ఘటన పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శివసేన నేత సంజయ్ నిరుపమ్ ఎంఎన్ఎస్పై విరుచుకుపడ్డారు. ఇది ఎంఎన్ఎస్ నిజస్వరూపం అని ఆరోపించారు. మరాఠీ రక్షకులమని చెప్పుకుంటున్నది వీళ్లేనా అని ఆరోపించాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
नशे में धुत।
अधनंगा।
एक मराठी भाषिक महिला के साथ गाली-गलौज करता हुआ मनसे का नेता पुत्र।
ऊपर से अपने बाप के रसूख़ की धौंस दे रहा है।
मराठी स्वाभिमान की रक्षा करने का दावा करनेवालों का असली चेहरा देखिए।
क्या इन्हीं मुसलमानों के दबाव में मनसेवाले हिंदुओं पर हमले कर रहे हैं ? pic.twitter.com/vOkXz1Ev0w— Sanjay Nirupam (@sanjaynirupam) July 7, 2025