న్యూఢిల్లీ: బ్రిటన్‌లో విద్వేష దాడి జరిగింది. ఇద్దరు సిక్కులను (Sikh Men) చిదకబాదారు. ముగ్గురు స్థానిక టీనేజర్లు అటాక్ చేశారు. ఈ ఘటన ఆగస్టు 15వ తేదీన జరిగింది. దీంతో భారీగా నిరసన వ్యక్తం అయ్యింది. వోల్వరాంప్టన్ రైల్వే స్టేషన్ సమీపంలో జాత్యంహకార దాడి జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అయ్యింది. బాధితులు గ్రౌండ్‌పై పడి ఉన్నారు. నిందితులు గట్టిగా కాలితో బాధితులను తన్నారు. ఆ దాడి సమయంలో సిక్కుల తలపాగా కిందపడిపోయింది. ఈ కేసులో ముగ్గురు టీనేజర్లను అరెస్టు చేశారు. వాళ్లను ఆ తర్వాత రిలీజ్ చేశారు. బ్రిటన్ ప్రభుత్వంతో ఈ అంశాన్ని చర్చించాలని శిరోమని అకాలీ దళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ విదేశాంగ మంత్రి జైశంకర్‌ను కోరారు.
I strongly condemn the horrific attack on two elderly Sikh men in Wolverhampton, UK, during the course of which one Sikh’s turban was removed forcibly.
▪️This racist hate crime targets the Sikh community, which always seeks Sarbat Da Bhala (the well-being of all).
▪️Known for… pic.twitter.com/5G0DJbZbBs— Sukhbir Singh Badal (@officeofssbadal) August 18, 2025