ముంబై, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): స్కాలర్షిప్ ప్రాక్టీస్ పరీక్షలో కులంపై ప్రశ్న రావడం మహారాష్ట్ర యావత్మాల్ జిల్లాలో దుమారం రేపింది. 5, 8వ తరగతుల విద్యార్థుల స్కాలర్షిప్ కోసం ‘టార్గెట్ పిక్ అప్స్’ అనే సంస్థ ద్వారా ఆన్లైన్ ప్రాక్టీస్ పరీక్షలు నిర్వహించారు. ఆన్లైన్ ప్రశ్నపత్రంలో ఉన్నత కులం ఏది? అని నాలుగు ఆప్షన్లు ఇవ్వడం వివాదానికి దారి తీసింది. స్కాలర్షిప్ల కోసం నిర్వహించే పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలు వేయడంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయి తే విద్యార్థుల మనసులో నుంచి కులాన్ని ఎలా నిర్మూలిస్తారు? అంటూ వారు మండిపడుతున్నారు.