Purnesh Modi – Rahul Gandhi | రాహుల్ పరువు నష్టం కేసులో.. సుప్రీంలో కేవియట్ దాఖలు చేసిన పూర్ణేష్ మోదీ..!
Purnesh Modi - Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై పరువు నష్టం కేసు వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సుప్రీంకోర్టులో బుధవారం కేవియట్ దాఖలు చేశారు. గుజరాత్ హైకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ అప్పీల్‌ను విచారించాలని ఆయన కేవియట్‌లో కోరారు.
Purnesh Modi – Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై పరువు నష్టం కేసు వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ సుప్రీంకోర్టులో బుధవారం కేవియట్ దాఖలు చేశారు. గుజరాత్ హైకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ అప్పీల్‌ను విచారించాలని ఆయన కేవియట్‌లో కోరారు. రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు సింగిల్ బెంచ్ జులై 7న తిరస్కరించిన విషయం తెలిసిందే.
కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సూరత్ కోర్టు విధించిన శిక్షపై స్టే విధించాలని పిటిషన్ దాఖలు చేస్తే.. తన వాదనలను సైతం వినాలని పూర్ణేష్ మోదీ తన న్యాయవాది పీఎస్ సుధీర్ ద్వారా కేవియట్ దాఖలు చేశారు. 2019 కర్ణాటకలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోదీ ఇంటిపేరునుద్దేశించి రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్‌ను దోషిగా పేర్కొంటూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత రాహుల్ పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఆ తర్వాత సూరత్ సెషన్స్ కోర్టు, గుజరాత్ హైకోర్టును ఆశ్రయించినా శిక్షపై స్టేను విధించేందుకు నిరాకరించాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ క్రమంలో పూర్ణేష్ మోదీ కేవియట్ దాఖలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

