పూరి: జన్నాథుడి రథయాత్ర(Puri Rath Yatra) కోసం పూరిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రథయాత్ర జరగనున్నది. అయితే ఆ సమయంలో డ్రోన్లపై నిషేధం విధించారు. అయిదు కిలోమీటర్ల పరిధి వరకు నో ఫ్లయింగ్ జోన్ ప్రకటించారు. రథయాత్రను నిర్వఘ్నంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే అనుమతి ఉన్న ఏజెన్సీలు తమ డ్రోన్లను ఆపరేట్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ఏరియల్ సర్వే, సెక్యూర్టీ ఆపరేషన్స్, ఏరియల్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, మ్యాపింగ్, డాక్యుమెంటేషన్, డిజాస్టర్ రెస్పాన్స్ కోసం డ్రోన్లను వినియోగించనున్నారు. దీనికి జిల్లా యంత్రాంగం అనుమతి అవసరం ఉంటుంది.