చెన్నై, మార్చి 30: ఎలక్ట్రిక్ బైకులు పేలిపోతున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో నాలుగు వాహనాలు కాలిపోయాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై వినియోగదారులు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
బుధవారం ఉత్తర చెన్నైలోని మథుర్ టోల్‌ప్లాజా దగ్గర ప్యూర్ ఈవీ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ కాలిపోయింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన స్కూటర్లో నుంచి తొలుత దట్టమైన పొగ వచ్చింది. ఆ తర్వాత బ్యాటరీ పేలి కాలిపోయింది.