న్యూఢిల్లీ: మన దేశంలోని పంజాబ్‌కు చెందిన సరబ్జిత్ కౌర్ (52) పాకిస్థాన్‌లో అదృశ్యమయ్యారు. ఆమె మరికొందరితో కలిసి పాక్‌లోని గురుద్వారాల సందర్శన కోసం వెళ్లారు. ఆమెతోపాటు వెళ్లినవారు ఈ నెల 13న తిరిగి భారత్‌కు వచ్చేశారు. కానీ ఆమె ఇమిగ్రేషన్ ఎగ్జిట్ క్లియరెన్స్ కోసం రిపోర్ట్ చేయలేదని పాక్ ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు.
అయితే దర్యాప్తులో ఆమె లాహోర్‌కు చెందిన నాసిర్ హుస్సేన్‌ను వివాహం చేసుకుని, ఇస్లాంలోకి మారి, తన పేరును నూర్‌గా మార్చుకున్నట్లు బయటపడింది. ఈ విషయాన్ని పాక్ పోలీసులు మన దేశ అధికారులకు తెలిపారు.