కన్నడ తెలియదన్న పంజాబీ మహిళ.. అసభ్యకరంగా తిట్టి పైపులతో దాడి
పంజాబ్‌కు చెందిన ఆ మహిళలో కన్నడలో మాట్లాడకపోవడంపై గుంపులోని మహిళలు ఆమెను తిట్టారు. కర్ణాటక నుంచి వెళ్లిపోవాలని ఆమెతో అన్నారు.
బెంగళూరు: కన్నడ తెలియదన్న పంజాబీ మహిళను అసభ్యకరంగా తిట్టడంతోపాటు పైపులతో దాడి చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఈ సంఘటన జరిగింది. పంజాబ్‌లోని లుధియానాకు చెందిన 40 ఏళ్లు పైబడిన మహిళ, కర్ణాటక రాజధాని బెంగళూరులో సెలూన్ అండ్ స్పా నిర్వహిస్తున్నది. శుక్రవారం రాత్రి 10 గంటలకు షాపు మూసిన తర్వాత ద్విచక్ర వాహనంపై విద్యారణ్యపుర ప్రాంతంలో వెళ్తున్నది. ఇంతలో ఒక చిన్నారి అజాగ్రత్తగా రోడ్డు దాటగా ఆమె సడన్‌గా తన స్కూటీని ఆపింది. ఈ నేపథ్యంలో పిల్లలను రోడ్డుపై అలా వదిలేయవద్దని అక్కడున్న తల్లిదండ్రులకు చెప్పింది.
కాగా, కొందరు స్థానిక మహిళలు ఆమె వద్దకు రాగా వాగ్వాదం మొదలైంది. పంజాబ్‌కు చెందిన ఆ మహిళలో కన్నడలో మాట్లాడకపోవడంపై గుంపులోని మహిళలు ఆమెను తిట్టారు. కర్ణాటక నుంచి వెళ్లిపోవాలని ఆమెతో అన్నారు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ తన మొబైల్ ఫోన్‌తో వారిని వీడియో తీయసాగింది. దీనిపై మండిపడిన మహిళలు ఆమె జట్టుపట్టుకుని లాగారు. ఆపై ప్లాస్టిక్ పైప్‌లతో కొట్టారు.
మరోవైపు తనపై జరిగిన దాడిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఆ పంజాబీ మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

