చండీగఢ్: పంజాబ్లో కొత్తగా రవాణాశాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి అమ్రీందర్ సింగ్ రాజా.. తన శాఖలో ఉన్న అవకతవకలపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ముందుగా బస్టాండ్లలో అపరిశుభత్రపై ఆయన కన్నేశారు. రాష్ట్రంలోని పలు బస్టాండ్లలో చెత్తాచెదారాన్ని నెలల తరబడి శుభ్రం చేయకపోవడంతో వ్యర్థం పేరుకుపోయి దుర్గంధం విసురుతున్నది. దాంతో ప్రయాణికు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయం మంత్రి దృష్టికి రావడంతో ఇవాళ ఆయన లూథియానాలోని పలు బస్టాండ్లలో మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఓ బస్టాండులో ఖాళీ మద్యం బాటిళ్లు, ఆ బాటిళ్లపై ఉండే అట్టలు, తెగిపోయిన చెప్పులు, ప్లాస్టిక్ కవర్లు, తినిపారేసిన ఆహార వ్యర్థాలు కనిపించాయి. దాంతో మంత్రి స్వయంగా రంగంలోకి దిగి వాటిని శుభ్రం చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్లలో వ్యర్థాలను తొలగించడానికి క్లీన్నెస్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
Punjab Transport Minister Amrinder Singh Raja Warring cleaned garbage at the bus stand in Ludhiana today.
— ANI (@ANI) October 3, 2021
"The minister has ordered a cleanliness drive at all bus terminals of Punjab to make them free of dirt and filth," says State government. pic.twitter.com/j8aakfoEPN