న్యూఢిల్లీ: ఉన్నత విద్య కోసం విదేశాల బాట పడుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతున్నది. అత్యధికంగా విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్యలో పంజాబ్, తెలంగాణ, మహారాష్ట్ర ముందువరుసలో ఉన్నాయి.
భారతీయ విద్యార్థులు అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియాతోపాటు ఇటీవలి కాలంలో కొత్తగా ప్రాధాన్యం ఇస్తున్న దేశాల జాబితాలో జర్మనీ, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫ్రాన్స్ తదితర దేశాలు ఉన్నాయని తాజా నివేదిక పేర్కొన్నది. శుక్రవారం జరిగిన గ్లోబల్ ఎడ్యుకేషన్ కాన్క్లేవ్ సందర్భంగా ‘బియాండ్ బెడ్స్ అండ్ బౌండరీస్: ఇండియన్ స్టూడెంట్స్ మొబిలిటీ రిపోర్ట్-2023’ నివేదికను విడుదల చేశారు. 2019లో విదేశాల్లో 10.9 లక్షల మంది విద్యను అభ్యసించగా.. 2025 నాటికి ఈ సంఖ్య దాదాపు 20 లక్షలకు చేరుతుందని నివేదిక అంచనా వేసింది.