
పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. 25 ఏళ్ల ఆగంతకుడు సిక్కుల మత గ్రంథమైన గురు గ్రంథ సాహెబ్‌ను అవమానించడానికి ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ విషయాన్ని గమనించిన భక్తులు.. ఒక్క సారిగా ఆ యువకుడిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో ఆ యువకుడు చనిపోయాడు. ఆ యువకుడు మరణించారని రాష్ట్ర హోంమంత్రి కూడా ధృవీకరించారు. అయితే ఈ ఘటనపై పోలీసు శాఖ కూడా స్పందించింది. పవిత్ర గ్రంథాన్ని అవమానపరిచేందుకు ఆ యువకుడు ప్రయత్నించాడని, దీంతో భక్తులు మూకుమ్మడి దాడి చేశారని, ఆ దాడిలో యువకుడు మరణించినట్లు పేర్కొన్నారు. ఆ మృత దేహాన్ని ఆస్పత్రికి పంపిచామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. అయితే ఆ యువకుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు సైతం లభించలేదని పేర్కొన్నారు.