ఇంటిని తలపిస్తున్న పంజాబ్ రైతు లారీ

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ సరిహద్దులోని సింఘు వద్ద నెల రోజులకుపైగా నిరసనలు చేస్తున్నారు. మరోవైపు శీతాకాలం కావడంతో చలి నుంచి రక్షణ కోసం రైతులు తమకు తోచిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పంజాబ్‌కు చెందిన ఒక రైతు తన లారీని ఏకంగా ఇంటిగా మార్చేశారు. జలంధర్‌కు చెందిన హర్‌ప్రీత్ సింగ్ మట్టు డిసెంబర్ 2న సింఘు ప్రాంతానికి వచ్చి రైతు నిరసనల్లో పాల్గొన్నారు. వారం రోజుల తర్వాత ఆయనకు ఇంటిపై ధ్యాస మళ్లింది. ఒకవైపు రైతు సమస్యలపై కేంద్రం ఏదీ తేల్చకపోవడం, మరోవైపు ఇంటికి దూరంగా ఉండాల్సి ఉండటంతో ఏం చేయాలో తోచలేదు.
స్నేహితుడి సలహా మేరకు తనకు చెందిన కంటైనర్ లారీని ఇంటిగా మార్చేశారు హర్‌ప్రీత్ సింగ్. టాయిలెట్, బెడ్, సోఫా, టీవీ, మొబైల్ చార్జింగ్ వంటివి అందులో ఏర్పాటు చేశారు. భార్య, కుమారుడు, బంధువుతోపాటు తన హోటల్‌కు చెందిన సుమారు 90 మంది సిబ్బందితో కలిసి గత నెల రోజులుగా లారీ ఇంటిలో ఉంటున్నారు. నిరసనల్లో పాల్గొన్న రైతులకు ప్రతి రోజు ఎల్లవేళలా టీ, స్నాక్స్, పకోడీలు వంటివి రోజంతా ఉచితంగా అందిస్తున్నారు. రైతు కుటుంబానికి చెందిన హర్‌ప్రీత్ సింగ్ నిరసనల్లో పాల్గొన్న రైతులకు తనకు తోచిన సహాయం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.తాజావార్తలు
- పవన్ కళ్యాణ్‌కు ఇచ్చిన మాట కోసం మాటలు రాస్తున్న త్రివిక్రమ్
- శతాబ్ది రాయ్ ‘యూటర్న్’: తృణమూల్‌తోనే నేను
- శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
- ‘మాస్టర్’ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..100 కోట్ల వైపు పరుగులు
- రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారు: హర్సిమ్రత్ కౌర్
- పిస్టల్‌తో బర్త్‌డే కేక్ కట్: సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ప్రజా వైద్యుడు రమక లక్ష్మణ మూర్తి కన్నుమూత
- ఇది సంక్రాంతి విజయం కాదు.. నిర్మాతలకు పెరిగిన నమ్మకం
- బీఈడీ తొలి విడుత సీట్లు కేటాయింపు
- ‘సలార్’లో యశ్ ఉన్నాడా..! పాన్ ఇండియన్ స్టార్స్ కలుస్తున్నారా..?