పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.5 తగ్గించిన పంజాబ్ సీఎం

చండీగఢ్: పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్న రాష్ట్రాల జాబితాలో తాజాగా పంజాబ్ చేరింది. లీటరు పెట్రోల్‌పై రూ.10, లీటరు డీజిల్‌పై రూ.5 తగ్గించాలని నిర్ణయించినట్లు ఆ రాష్ట్ర సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌పై ఈ తగ్గింపు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తుందని చెప్పారు.
గత రెండు నెలలుగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో కేంద్రంలోని అధికార బీజేపీకి ఇటీవల జరిగిన మూడు లోక్‌సభ, 30 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో దీపావళి పండుగ సందర్భంగా సామాన్య ప్రజలకు స్వల్పంగా రిలీఫ్ ఇచ్చింది. లీటర్ పెట్రోల్‌పై రూ.5, లీటర్ డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని కేంద్రం తగ్గించింది.
అనంతరం పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం బాటపట్టాయి. ఎక్సైజ్ సుంకానికి అనుగుణంగా వ్యాట్ పెంచేసిన పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు దానిని తగ్గించే పనిలో పడ్డాయి. కర్ణాటక, అసోం, గుజరాత్, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మణిపూర్, త్రిపుర, ఒడిశా తదితర రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించాయి. తాజాగా ఈ జాబితాలో పంజాబ్ కూడా చేరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

