Punjab CM : కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్ (NITI Ayog) సమావేశాన్ని బహిష్కరిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుకూ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆ జాబితాలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చేరారు.
కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగిందనే ఆరోపణలతో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో వచ్చే శనివారం (జూలై 27న) ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం కానున్నది. ప్రతిపక్ష కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నీ నీతి ఆయోగ్‌ను బహిష్కరించడం గమనార్హం. ఇదిలావుంటే ‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం’ అనే అంశంపై బుధవారం అసెంబ్లీ తీర్మానం చేసింది.