BSF | సరిహద్దుల్లో నిఘా పెంచిన బీఎస్ఎఫ్..
BSF | చలికాలం నేపథ్యంలో సరిహద్దుల చొరబాట్లు పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పాక్‌ను ఆనుకొని ఉన్న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, అమృత్సర్, టార్న్ తరణ్, పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్, ఫజిల్కా జిల్లా సరిహద్దుల్లో చొరబాట్లు పెరిగే ఉండడంతో బీఎస్ఎఫ్ అప్రమత్తమై జిల్లాల్లో ప్రత్యేక నిఘా పెంచింది.
BSF | చలికాలం నేపథ్యంలో సరిహద్దుల చొరబాట్లు పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా పాక్‌ను ఆనుకొని ఉన్న పంజాబ్‌లోని గురుదాస్‌పూర్, అమృత్సర్, టార్న్ తరణ్, పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్, ఫజిల్కా జిల్లా సరిహద్దుల్లో చొరబాట్లు పెరిగే ఉండడంతో బీఎస్ఎఫ్ అప్రమత్తమై జిల్లాల్లో ప్రత్యేక నిఘా పెంచింది. బీఎస్ఎఫ్ పోలీసులను, స్థానిక పౌరులను అప్రమత్తం చేయడం ప్రారంభించింది. సాయంత్రం ఉదయం 7 గంటలకు స్థానికులు సరిహద్దు ప్రాంతాలకు వెళ్లకుండా నిషేధం విధించారు.
రాబోయే రోజుల్లో ఆపరేషన్ ‘సర్ద్ హవా’ ప్రారంభించబోతున్నట్లు పేర్కొంది. సైనికులు ప్రత్యేక ఆపరేషన్ కింద గస్తీ నిర్వహిస్తారు. గుర్రాలు, జీపుల్లో సవారీ చేస్తూ సైనికులు సరిహద్దును పర్యవేక్షిస్తారు. చలికాలంలో పొగమంచు పెరగడంతో సరిహద్దుల్లో చొరబాట్ల ప్రమాదం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. పాక్‌లో కూర్చున్న స్మగ్లర్లు ఈ సీజన్‌ను సద్వినియోగం చేసుకొని డ్రగ్స్, ఆయుధాలను స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అమృత్సర్, టార్న్ తరణ్ సరిహద్దు ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ పంజాబ్ పోలీసుల బృందాలను ఏర్పాటు చేసింది. సరిహద్దు గ్రామాలను 24గంటలు నిఘా వేసింది. బీఎస్ఎఫ్ 144వ బెటాలియన్‌కు చెందిన సైనికులు పగలు, రాత్రి తేడా లేకుండా నిఘా ఉంచారు. బీఎస్ఎఫ్ డీఐజీ సంజయ్ గౌర్ నేతృత్వంలో సరిహద్దు ప్రాంతాలకు వచ్చి వెళ్లే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచారు. సైనికుల సంఖ్యను పెంచడంతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో సైతం అప్రమత్తమైంది. అంతర్జాతీయ సరిహద్దులోని ఐదు కిలోమీటర్ల ప్రాంతంలో రాత్రి సమయంలో సంచరించడాన్ని నిషేధిస్తూ డిప్యూటీ కమిషనర్ ఘనశ్యామ్ థోరి ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- BSF
- Infiltration
- Pakistan
- Punjab
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

