Zomato | ఒక్క ఏడాదిలో ఫుడ్ కోసం రూ.28 లక్షలు వెచ్చించాడట..!
పూణె వాసి తేజస్ 2022లో ‘జొమాటో’ యాప్ ద్వారా రూ.28 లక్షల విలువ చేసే ఫుడ్‌ను ఆర్డర్ చేసుకున్నాడట. ఈ విషయాన్ని జొమాటో ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘ఇది ట్విట్టర్ ధర కంటే కేవలం రూ.36,42,17,44,48,38 తక్కువ’ అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చింది. మరో వ్యక్తి ఒకే ఆర్డర్లో రూ.25వేలు విలువ చేసే పిజ్జాలను ఆర్డర్ చేసినట్లు జొమాటో తన నివేదికలో పేర్కొంది. రాహుల్ అనే మరో కస్టమర్ 1,098 కేకులు ఆర్డర్ చేసుకున్నట్లు తెలిపింది.
Zomato | ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘జొమాటో’ ఇటీవల తన వార్షిక నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. యాప్ ద్వారా అత్యధికంగా బిర్యానీలే ఆర్డర్ వచ్చినట్లు వెల్లడించింది. అందులో ఢిల్లీకి చెందిన అంకుర్ అనే వ్యక్తి ఈ ఏడాదిలో 3,300 ఆర్డర్లు ఇచ్చి ‘ది నేషన్స్ బిగ్గెస్ట్ ఫుడీ..’ గా నిలిచాడు. కాగా, ఈ ఏడాదికి సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను జొమాటో వెల్లడించింది.
పూణె వాసి తేజస్ 2022లో ‘జొమాటో’ యాప్ ద్వారా రూ.28 లక్షల విలువ చేసే ఫుడ్‌ను ఆర్డర్ చేసుకున్నాడట. ఈ విషయాన్ని జొమాటో ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ‘ఇది ట్విట్టర్ ధర కంటే కేవలం రూ.36,42,17,44,48,38 తక్కువ’ అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చింది. మరో వ్యక్తి ఒకే ఆర్డర్లో రూ.25వేలు విలువ చేసే పిజ్జాలను ఆర్డర్ చేసినట్లు జొమాటో తన నివేదికలో పేర్కొంది. రాహుల్ అనే మరో కస్టమర్ 1,098 కేకులు ఆర్డర్ చేసుకున్నట్లు తెలిపింది.
ఇక డిస్కౌంట్ ప్రోమో కోడ్లను ఉపయోగించుకునే విషయంలో పశ్చిమబెంగాల్లోని రాయ్‌గంజ్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 99.7 శాతం కస్టమర్లు డిస్కౌంట్ ప్రోమో కోడ్ తోనే ఈ ఏడాది ఆర్డర్ చేశారు. ముంబయికి చెందిన ఓ కస్టమర్ ప్రోమో కోడ్ల ద్వారా ఈ ఏడాది జొమాటో ఆర్డర్లపై రూ.2.43 లక్షలను ఆదా చేసుకున్నాడు. కాగా, జొమాటో యాప్‌లో బిర్యానీ తర్వాత ఎక్కువగా పిజ్జా ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ తన నివేదికలో తెలిపింది. ప్రతి నిమిషానికి 139 పిజ్జా ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్