ముంబై: మహారాష్ట్రలోని పూణెకు చెందిన 75 ఏళ్ల డాక్టర్ .. సైబర్ మోసగాళ్ల(Cyber Crime) వలలో చిక్కుకుని సుమారు 12 కోట్లు కోల్పోయాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే, 11 రోజుల్లో అమౌంట్ రెట్టింపు అవుతుందని చెప్పి అతన్ని మోసం చేశారు. ఒకవేళ 11 రోజుల స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే అప్పుడు దాదాపు 54 కోట్లు రిటర్న్స్ వస్తాయని ఆ డాక్టర్‌ను నమ్మించారు. తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మిన ఆ డాక్టర్.. కొన్ని వారాల పాటు ఆ సైబర్ నేరగాళ్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాడు.
ఈ ఏడాది జనవరిలో చీటింగ్ మొదలైనట్లు పోలీసు ఫిర్యాదు ద్వారా తెలిసింది. బాధిత డాక్టర్‌కు తొలుత గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. స్టాక్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు వస్తాయని ఆ మెసేజ్‌లో పంపారు. దీంతో డబ్బుకు ఆశపడ్డ ఆ డాక్టర్ సైబర్ నేరగాళ్ల పట్ల ఇంట్రెస్ట్ చూపాడు. వీఐపీ స్టాక్ 24 అనే వాట్సాప్ గ్రూపు ద్వారా వృద్ధ డాక్టర్‌ను సైబర్ నేరగాళ్లు ఆకర్షించారు. ఆ వాట్సాప్ గ్రూపు ద్వారా నిందితులు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌ను షేర్ చేశారు. ఆ ప్లాన్ ఆకర్షణీయంగా ఉండడంతో.. డాక్టర్ తన వద్ద ఉన్న డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేశారు. తాము ఇచ్చే ఆదేశాలు సరైన రీతిలో పాటిస్తే కేవలం 11 రోజుల్లోనే రిటర్న్స్ వచ్చేస్తాయని సైబర్ నేరగాళ్లు పదేపదే ఆ డాక్టర్‌ను నమ్మించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బాధితుడు నకిలీ ట్రేడింగ్ యాప్‌ను ఆశ్రయించినట్లు తెలిసింది. ఓ ప్రముఖ సంస్థ పేరుతో ఆ యాప్ ఉన్నట్లు గుర్తించారు. మొదట పర్సనల్, ఫైనాన్షియల్ వివరాలను సైబర్ నేరగాళ్లు సేకరించారు. ఇక అనేక బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని కోరారు. ఆ డాక్టర్ పంపిన డబ్బును ఫేక్ యాప్‌లో ఇన్వెస్ట్మెంట్గా చూపించారు. ఇంకా బూరి లాభాలు కూడా వస్తున్నట్లు ఆ యాప్‌లో ప్రజెంట్ చేశారు. మార్చి 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకు బాధితుడు 8 అకౌంట్లకు డబ్బును ట్రాన్స్ఫర్ చేశాడు. సుమారు 12.31 కోట్ల డబ్బును ఆ డాక్టర్ బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
అయితే డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు నిరాకరించిన సమయంలో డాక్టర్‌పై సైబర్ నేరగాళ్లు వత్తిడి తెచ్చారు. ప్రాపర్టీని సీజ్ చేస్తామని నిందితులు బెదిరించారు. డాక్టర్‌ను భయపెట్టి డబ్బులు బదిలీ చేసేలా చేశారని పోలీసులు పేర్కొన్నారు. సుమారు మూడు నెలల పాటు బాధితుడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారన్నారు. అయితే డబ్బులు రిటర్న్ రాకపోవడంతో చీటింగ్‌కు గురైనట్లు ఆ డాక్టర్ గుర్తించాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు ఇచ్చాడు. ఫిర్యాదు ఆధారంగా సైబర్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.