న్యూఢిల్లీ: 2019 పుల్వామా దాడి సూత్రధారుల్లో ఒకరైన హమ్జా బుర్హాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ముజఫరాబాద్‌లో ఈ ఘట న జరిగింది. పుల్వామాకు చెందిన బుర్హాన్ 2017లో ఉన్నత చదువుల నిమిత్తం పాక్ వెళ్లి అక్కడ నిషేధిత అల్-బడ్ సంస్థలో చేరి కమాండర్ స్థాయికి ఎదిగాడు.
ఆ తర్వాత కశ్మీర్ తిరిగి వచ్చి యువతలో ఉగ్రవాద బీజాలు నాటాడు. ఫిబ్రవరి 14, 2019లో 40 మంది సీఆర్పీఫ్ జవాన్ల సజీవ దహనానికి కారణమైన పుల్వామా దాడితో పాటు కశ్మీర్లో పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో అతడి ప్రమేయం ఉన్నది.