జవాబుదారీతనంలోనే న్యాయవ్యవస్థ బలం.. లండన్లో సీజేఐ ఉద్ఘాటన
న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దానంతట అదే ఏర్పడదని, పారదర్శకత, స్థిరత్వం, స్వీయ దిద్దుబాటు సంసిద్ధత ద్వారా దానిని నిరంతరం సంపాదించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ అన్నారు.
న్యూఢిల్లీ, జూన్ 6 : న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం దానంతట అదే ఏర్పడదని, పారదర్శకత, స్థిరత్వం, స్వీయ దిద్దుబాటు సంసిద్ధత ద్వారా దానిని నిరంతరం సంపాదించుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ అన్నారు. శుక్రవారం లండన్లోని క్వీన్ మేరే యూనివర్సిటీలో సెంటర్ ఫర్ కమర్షియల్ లా నిర్వహించిన ఒక కార్యక్రమంలో సీజేఐ విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగించారు.
రాజ్యాంగ ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడంలో న్యాయవ్యవస్థ పాత్రపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ వ్యవస్థలు నేర్చుకోవడానికి, దిద్దుబాటుకు సిద్ధంగా ఉండటం ద్వారా బలోపేతమవుతాయని అన్నారు. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ జవాబుదారీతనానికి చివరి ఆధారం. కానీ అది కూడా రాజ్యాంగానికి, తాను సేవ చేసే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి అని సీజేఐ చెప్పారు. రాజ్యాంగ సూత్రాలను కేవలం కాగితాల మీద మాటల నుండి ప్రతి పౌరుని స్వేచ్ఛకు సజీవ హామీలుగా న్యాయస్థానాలు మార్చాలని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

