న్యూఢిల్లీ, జూలై 29: పిల్లలు, యువతలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న పబ్జీ ఇండియన్ వెర్షన్ అయిన బీజీఎంఐపై కూడా కేంద్రప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పటికే దేశ భద్రతకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంగా పబ్జీ సహా అనేక చైనా యాప్‌లను బ్యాన్ చేసిన కేంద్రం అదే తరహాలో క్రాఫ్టన్స్ బ్యాటిల్‌గ్రౌండ్ మొబైల్ గేమ్ (బీజీఎంఐ)ని నిషేధించింది. ఇందుకు ఐటీ చట్టం-2020లోని 69ఏ నిబంధన ప్రకారం బ్యాన్ చేసింది. వెనువెంటనే గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్‌స్టోర్.. గేమ్‌ను తొలగించాయి.