మాండ్యా: కర్నాటకలోని మద్దూర్లో జరిగిన రాళ్ల దాడి ఘటన నేపథ్యంలో .. బీజేపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సీటీ రవి(CT Ravi)పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బుధవారం జరిగిన గణేశ్ నిమజ్జనోత్సవం సమయంలో.. సీటీ రవి విద్వేష ప్రంగం చేపట్టినట్లు ఆరోపిస్తున్నారు. సీటీ రవి ప్రసంగం రెండు వర్గాలను రెచ్చగొట్టినట్లు ఉందని పోలీసులు పేర్కొన్నారు. మద్దరూ పోలీసులు ఆయనపై సుమోటో కేసు నమోదు చేశారు. సబ్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు ఫైల్ చేశారు. వినాయక నిమజ్జనం కోసం ర్యాలీ జరుగుతున్న సమయంలో తన వద్ద ఉన్న మైక్రోఫోన్ ద్వారా ఆయన ముస్లిం వర్గీయులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.