NEET Answer Sheet | వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎల్జిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కు మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. నీట్ పరీక్ష రాసిన విద్యార్థినికి ఆన్సర్ షీట్ అంద జేయాలని ఎన్టీఏను ఆదేశించింది. ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలో సదరు విద్యార్థిని మెరుగైన ర్యాంక్ సాధించలేకపోయింది. దీనిపై ఖిన్నురాలైన సదరు విద్యార్థిని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
దీనిపై జస్టిస్ ఆర్ సురేశ్ కుమార్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులోని నీలగిరీస్ జిల్లా పరిధిలోని చ్రిస్మా విక్టోరియా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సురేశ్ కుమార్ విచారణ జరిపారు. దీనిపై స్పందించిన ఎన్టీఏ.. ఆన్సర్ షీట్ సదరు విద్యార్థినికి అంద చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది.
సదరు విద్యార్థిని ఆన్సర్ షీట్ తీసుకునేందుకు నొయిడాకు వెళ్లాల్సి ఉంటుందని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఇందుకోసం పది రోజుల్లో ఆ విద్యార్థిని ఒక తేదీని ఖరారు చేసి సమాచారం ఇవ్వాలని ఎన్టీఏను ఆదేశించింది. పిటిషన్‌తోపాటు ఆమె తండ్రి లేదా గార్డియన్ కూడా వెళ్లొచ్చునని స్పష్టం చేసింది.