న్యూఢిల్లీ, డిసెంబర్ 23: హిందువైన దీపూ చంద్ర దాస్‌ను గత వారం బంగ్లాదేశ్‌లోని మిస్మెన్సింగ్లో ఇస్లామిస్ట్ మూకలు దారుణంగా చంపడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. బంగ్లాదేశ్‌లో హిందువుల పైన, ప్రార్థనా మందిరాల పైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ), బజరంగ్ దళ్ సారథ్యంలో ఈ నిరసన ప్రదర్శన జరిగింది.
పోలీసులతో ఘర్షణ పడిన నిరసనకారులు బారికేడ్లను ఛేదించుకుని హైకమిషన్‌లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించారు.