శ్రీనగర్ : జమ్ము-కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన ప్రకటన చేశారు. జులై 20 నుంచి రాష్ట్ర హోదా కోసం ఢిల్లీలో ధర్నా చేయబోతున్నట్టు
తెలిపారు. జంతర్‌మంతర్ వద్ద ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ ఎన్నికలు అయినప్పటి నుంచి రాష్ట్ర హోదా
కోసం మేం ఎదురు చూస్తున్నాం.
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చాం. జమ్ము-కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని ఎన్నోసార్లు
చర్చలు జరిపాం. కానీ కేంద్రం పట్టించుకోవట్లేదు. రాష్ట్ర హోదా కోసం మేం మా రాష్ట్రంలో, అసెంబ్లీలో పోరాడుతుంటే బీజేపీ పదే పదే
అడ్డుకుంటున్నది’ అని సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు.