న్యూఢిల్లీ: వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరిట బ్యూరోక్రాట్లతో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయించాలన్న మోదీ సర్కారు ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) బ్రేకులు వేసింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, ఛత్తీస్గఢ్లో ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆయా రాష్ర్టాల్లో ఈ యాత్ర నిర్వహించరాదని క్యాబినెట్ సెక్రటరీకి ఈసీ స్పష్టంచేసింది. కేంద్ర పథకాల ప్రచారానికి రథ్ ప్రభారీస్గా (స్పెషల్ ఆఫీసర్లు) బ్యూరోక్రాట్లను నియమిస్తూ కేంద్రం ఇటీవల జారీచేసిన ఉత్తర్వులు వివాదస్పదమైన విషయం తెలిసిందే. బ్యూరోక్రాట్లనూ రాజకీయ లబ్ధికి కేంద్ర ప్రభుత్వం వాడుకుంటుండటంపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.