బెంగళూరు, ఫిబ్రవరి 26: యూకే నుంచి వచ్చిన భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ నిటాషా కౌల్‌కు దేశంలోకి ప్రవేశాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు నిరాకరించారు. దీంతో కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానం మేరకు 24, 25 తేదీ ల్లో జరిగిన ‘రాజ్యాంగ, జాతీయ ఐక్య త సదస్సు-2024’లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె.. బెంగళూరు ఎయిర్‌పోర్టులోనే నిలిచి పోవాల్సి వచ్చింది.
కశ్మీ రీ పండిట్ అయిన నిటాషా కౌల్ బ్రిటన్‌లో యూనివర్సిటీ ఆఫ్ వెస్టుమినిస్టర్లో ప్రొఫెసర్. భారత్‌లోకి తనకు ప్ర వేశం నిరాకరించడంపై నిటాషా ఆదివారం ఎక్స్‌లో వరుస పోస్టులు చేశా రు. తన వద్ద పాస్ట్‌పోర్టు, ఇతర అన్ని పత్రాలు ఉన్నా తనను అడ్డుకోవడంపై అధికారులు కారణాలు చెప్పలేదన్నా రు. కాగా, నిటాషాకు అనుమతి నిరాకరణపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇ ది భావ ప్రకటనా స్వేచ్ఛ, సమాఖ్య సూత్రాలపై దాడి అని కాంగ్రెస్ పేర్కొన్నది. నిటా షా ఒక టెర్రరిస్టు సానుభూతిరాలు అని బీజేపీ ఆరోపించారు.