న్యూఢిల్లీ : కుంభమేళాతో ప్రాచుర్యం పొందిన మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచారు. నెల క్రితం ఓ ముస్లింను కేరళలో ఆమె పెండ్లి చేసుకొన్నారు. అయితే ఆ సమయానికి ఆమె ఇంకా మైనరే అని తేలడంతో, ఆమె భర్తపై మధ్యప్రదేశ్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. చట్ట విరుద్ధంగా పెండ్లి చేసుకొన్నాడన్న కారణంగా, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కూడా అతడిపై కేసు నమోదైంది.
మోనాలిసా పుట్టిన దవాఖాన రికార్డుల ప్రకారం పెండ్లి నాటికి ఆమె వయసు 16 ఏండ్ల 2 నెలల 12 రోజులేనని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ తేల్చింది. అయితే ఆమె పెండ్లి చేసుకొన్న కేరళలోని ఆలయం, ఆమె పెండ్లి నమోదైన గ్రామ పంచాయతీ కార్యాలయంలో మోనాలిసా ఆధార్ కార్డ్ ప్రకారం ఆమె వయసు 18 ఏండ్లుగా ఉన్నది.