Priyanka Chaturvedi : ఈవీఎంలపై అభ్యంతరాల వ్యవహారం కలకలం రేపుతోంది. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈవీఎంపై పుస్తకాన్ని ప్రచురించారని, దీన్ని ఆ పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీ సమర్దించారని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. ఈవీఎంపై ఎలాంటి సందేహాలున్నా వాటిని తొలగించాల్సిన బాధ్యత ఈసీపై ఉందని అన్నారు.
ప్రియాంక చతుర్వేది సోమవారం ముంబైలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఒక్క ఓటరుకు ఎన్నికల ప్రక్రియపై అనుమానం వచ్చినా దాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, సజావుగా సాగాలని పేర్కొన్నారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్ధలకు విఘాతం కలగకుండా తాము తమ గొంతుకను వినిపిస్తామని స్పష్టం చేశారు.
ఇక లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లపై శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు లేకుంటే బీజేపీకి కనీసం 40 సీట్లు కూడా వచ్చేవి కాదని అన్నారు. అమోల్ కృతికార్ స్ధానంలో తాము విజయం సాధించామని, దీనిపై తాము న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఈసీ అంటే ఎన్నికల కమిషన్ కాదని, ఈజీలీ కాంప్రమైజ్డ్ అని సరికొత్త భాష్యం చెప్పారు. కాషాయ పార్టీ ఈవీఎంలను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించిందని అన్నారు.
Read More :
Maoists | జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి