Maoists | జార్ఖండ్‌లో భారీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
జార్ఖండ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్భమ్ జిల్లాలో మావోయిస్టులకు (Maoists) భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
రాంచీ: జార్ఖండ్‌లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్భమ్ జిల్లాలో మావోయిస్టులకు (Maoists) భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలంలో పెద్దమొత్తంగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ అశుతోశ్ శేఖర్ చెప్పారు. ఆప్రాంతంలో గాలింపు ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.
కాగా, శనివారం ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లా అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. నారాయణ్‌పూర్, కొండగావ్, కాంకేర్, దంతేవాడ డీఆర్జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ 53వ బెటాలియన్, బీఎస్ఎఫ్ 135వ బెటాలియన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం ఉదయం పెద్ద సంఖ్యలో సాయుధులుగా ఉన్న మావోయిస్టులు తారసపడి జవాన్లపై మెరుపు వేగంతో కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు తేరుకుని ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ఇరువర్గాల మధ్య సుమారు రెండు గంటలపాటు కాల్పులు చోటు చేసుకున్నాయి.
కాసేపటికి జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే దట్టమైన అటవీ మార్గంలోకి పారిపోయారు. కాల్పుల విరమణ తర్వాత జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎదురు కాల్పుల్లో మృతి చెందిన 8 మంది మావోయిస్టుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. ఒక ఇన్సాస్ రైఫిల్, 303 రైఫిల్, బీజీఎల్ లాంచర్‌తోపాటు ఆయుధ వస్తు సామగ్రిని భారీగా జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కాల్పుల్లో ఒక ఎస్టీఎఫ్ జవాన్ మృతి చెందగా, మరో ఇద్దరు ఎస్టీఎఫ్ జవాన్లు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
Rare opportunity | బేగంపేట విద్యార్థుకు అరుదైన అవకాశం.. రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానం
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

