Priyanka Chaturvedi : ఢిల్లీలో నీటి సంక్షోభంపై శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది కీలక వ్యాఖ్యలు చేశారు. చతుర్వేది బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైషమ్యాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడం విచారకరమని అన్నారు.
ఇరు ప్రభుత్వాలు తమ రాజకీయ విభేదాలను విడనాడి నీటి సమస్యకు పరిష్కారం చూపాలని హితవు పలికారు. ప్రభుత్వాలు రాజకీయ పంతాలకు పోయి ప్రజలను సమస్యల్లోకి నెట్టడం సరైంది కాదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధానిలో నీటి ఎద్దడి నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే పూనుకోవాలని ప్రియాంక చతుర్వేది డిమాండ్ చేశారు.
Read More :
Pawan Kalyan | చిరంజీవి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకున్న మంత్రి పవన్ కళ్యాణ్