Corporate Companies | న్యూఢిల్లీ: మన దేశంలో కార్పొరేట్ కంపెనీలకు గత నాలుగేళ్లలో లాభాలు నాలుగు రెట్లు పెరిగాయి. కానీ అవి ఉద్యోగుల జీతాలను మాత్రం పెంచడం లేదు. ఫిక్కీ-క్వెస్ కార్ప్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. 2019-2023 మధ్య కాలంలో కాంపౌండెడ్ వార్షిక వేతన వృద్ధి రేటు 0.8 శాతం నుంచి 5.4 శాతం మధ్య ఉంది. ఈ నివేదికను తయారు చేయడం కోసం ఆరు రంగాలను అధ్యయనం చేశారు.
వీటిలో ఎఫ్ఎంసీజీ రంగంలో మాత్రమే వేతనాల వృద్ధి ఎక్కువగా (5.4 శాతం) ఉంది. ప్రైవేట్ రంగంలో వేతనాలు తిరోగమన వృద్ధిలో ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది. వేతనాల వృద్ధి నెగెటివ్‌గా ఉండటం వల్ల వినియోగశక్తి తగ్గిందని, ఫలితంగా భారత దేశ ఆర్థిక వృద్ధి దెబ్బతిందని వెల్లడించింది.