న్యూఢిల్లీ, అక్టోబర్ 4: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఏనాడూ ఇదేమిటని ప్రశ్నించని ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా ట్రంప్‌ను ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు! గాజాలో కాల్పుల విరమణ కోసం ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికను పాక్షికంగా హమాస్ ఒప్పుకున్న కొన్ని గంటల్లోనే మోదీ అమెరికా అధ్యక్షుడిని పొగడ్తల్లో ముంచెత్తారు. గాజాలో శాంతి స్థాపన కోసం ట్రంప్ నాయకత్వంలో జరుగుతున్న ప్రయత్నాలను స్వారష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదన్న ఏకైక కారణంతో భారత్‌పై ప్రతీకార సుంకాలు విధించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్న అమెరికా అగతిస్తున్నట్లు ఎక్స్ వేదికగా మోదీ వెల్లడించారు. గాజాలో సుస్థిరమైన శాంతి కోసం జరిగే అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు కొనసాగుతుందని కూడా ఆయన హామీ ఇచ్చారు.
అయితే, భారత్-పాక్ యుద్ధాన్ని తానే నిలిపివేసినట్లు పదే పదే ట్రంప్ ప్రకటిస్తున్నా ఏనాడూ మోదీ ఖండించ లేదు. ఆ తర్వాత ఎఫ్-1బీ వీసాల విషయంలో కాని, ట్రంప్ ప్రభుత్వం విధించిన 50 శాతం దిగుమతి సుంకాల విషయంలోనూ మోదీ మౌనాన్నే ఆశ్రయించారు. తాజాగా, చైనాలో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమైన తర్వాత మోదీపైన, భారత్‌పైన అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు ట్రంప్ ఎన్ని విమర్శలు గుప్పించినా మౌనాన్ని వీడని మోదీకి గాజాలో శాంతి స్థాపన కోసం ట్రంప్ సాగిస్తున్న కృషి అద్భుతంగా కనిపించడం విశేషం. ఈ వారం మొదట్లో కూడా ట్రంప్ గాజా శాంతి ప్రణాళికను కీర్తిస్తూ మోదీ ట్వీట్ చేశారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ ప్రజల మధ్య సుస్థిర శాంతి ఏర్పాటుకు ఈ శాంతి ప్రణాళిక దోహదపడగలదని ఆశిస్తున్న మోదీ పాకిస్థాన్ తరహాలో ట్రంప్ కోరుకుంటున్నట్లు నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును సిఫార్సు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ విశ్లేషకుల భావన.